హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తు
ట్రాఫిక్ పోస్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
రద్దీ ప్రాంతాలను పరిశీలించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్
సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ తెలిపారు. శుక్రవారం సంత, పశువుల మార్కెట్ జరిగే ప్రాంతాన్ని, అలాగే అధికంగా రద్దీ ఉండే మల్లె చెట్టు చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా ప్రాంతాలను సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం పర్యవేక్షించారు. అంబేద్కర్ చౌరస్తా మరియు అక్కన్నపేట రోడ్డు కూడళ్ల వద్ద తరచుగా ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నట్లు ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. ఇలాంటి ట్రాఫిక్ నివారణకు కసరత్తు ప్రారంభించినట్లు సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి తెలిపారు. అలాగే ప్రత్యేక ట్రాఫిక్ పోస్ట్ ఏర్పాటుతోపాటు ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్ళు అవసరమని పేర్కొని నివేదికలో ప్రతిపాదించామని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను సజావుగా నిరాటంకంగా నడిపించడానికి తక్షణ చర్యలు అవసరమని నిర్ణయించారు. అంతేకాకుండా ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఒక ప్రత్యేక గదిని కేటాయించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల పరిశీలన కోసం త్వరలో పంపనున్నట్లు ప్రతిపాదనలకు ఆమోదం లభించిన వెంటనే ట్రాఫిక్ పోస్టులను ఏర్పాటు చేసి హుస్నాబాద్ పట్టణ వాసులకు మెరుగైన ట్రాఫిక్ నివారణ సేవలను అందించి ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ పర్యవేక్షణలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ తో పాటు సిద్దిపేట టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఎస్ఐ నీరేష్ అలాగే హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
Posted inతాజావార్తలు బ్రేకింగ్ న్యూస్ హుస్నాబాద్
హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తు





