సీఎం సభకు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి
సభ సజావుగా జరిగేందుకు సహకరించాలి
హుస్నాబాద్ ఏసీపీ సౌదారపు సదానందం
వాహనదారులకు ట్రాఫిక్, పార్కింగ్ సూచనలు
సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 3 న హుస్నాబాదుకు రానున్న నేపథ్యంలో సభకు వచ్చే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం కోరారు. ఈ సందర్భంగా సభకు వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ పై ముఖ్య సూచనలు చేశారు.
భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సైదాపూర్ మండలాల నుండి వచ్చే ప్రజలు, వాహనదారులు పోతారం (ఎస్) గ్రామం దాటిన తర్వాత భారత్ పెట్రోలియం బంక్ పక్కనుండి శాతవాహన డిగ్రీ కాలేజీ వైపు వెళ్లాలని, అక్కడ కేటాయించిన పార్కింగ్ స్థలంలో తమ వాహనాలను నిలుపుకోవాలన్నారు.
హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి మండలాల నుండి వచ్చే ప్రజలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న సొసైటీ బ్యాంకు వద్ద నుండి నేరుగా కేటాయించిన పార్కింగ్ స్థలం కు చేరుకోవాలని సూచించారు.
అక్కన్నపేట మండలం నుండి వచ్చే వారు కిషన్ నగర్ దాటిన తర్వాత నిర్ధారించిన ప్రదేశంలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు.
సభ మధ్యాహ్నం జరుగుతున్నందున ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు నిలుపుకోవాలని కోరారు. సభ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Posted inతాజావార్తలు
సీఎం సభకు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి



