హుస్నాబాద్ లో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన భాగంగా సోమవారం రోజు రహదారి నిర్మాణంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ, నాళాల నిర్మాణాలను పరిశీలించారు. రోడ్ల విస్తరణ లో షాపులు, ఇళ్లు కోల్పోతున్న యజమానులతో స్థానిక నేతలతో కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణ వ్యాపారస్తులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. వర్షాలు ప్రారంభం కాకముందే పనులను పూర్తి చేయాలని, నిర్మాణ పనులకు పట్టణ వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని కోరారు.
రహదారి విస్తరణ పనులు త్వరగా పూర్తి అయితే హుస్నాబాద్ పట్టణం మరింత అభివృద్ధిని సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్, కాంగ్రెస్ నాయకులు కోమటి సత్యనారాయణ, రహదారి నిర్మాణ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







