జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుల సందడి
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:


తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బిజీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ఆధ్వర్యంలో, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు అందిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హుస్నాబాద్ నాయకుల ఉత్సాహం, ప్రజల్లో పార్టీకి వస్తున్న మద్దతుతో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని నాయకులు తెలిపారు. “ప్రజలకు చేరువైన ప్రభుత్వం – ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించేది కాంగ్రెస్ పార్టీ” అని బొలిశెట్టి శివయ్య పేర్కొన్నారు. ఈ ప్రచారంలో మాజీ కౌన్సిలర్‌లు వల్లపు రాజు, చిత్తారి పద్మ, భూక్యా సరోజన, కాంగ్రెస్ నాయకులు పున్నసది, సావుల రాజయ్య, రమణ, బేక్కంటి రాజయ్య, పెరుమాండ్ల నర్సా గౌడ్, ఠాగూర్ భగవాన్ సింగ్, కూన విశ్వతేజ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






