బైరాన్ పల్లిలో విద్యుత్ షాక్ తో పాడే గేదె మృతి
సిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట(నవంబర్, 7)
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామానికి చెందిన గొర్ల మల్లయ్య కు చెందిన పాడిగేదె విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందింది.గ్రామస్తుల వివరాల ప్రకారం రైతు మల్లయ్య తన వ్యవసాయ బావి వద్ద గేదెను కట్టేసి ఇంటికి వెళ్ళాడు.తిరిగి ఉదయం వచ్చి చూసేసరికి విద్యుత్ LT లైన్ వైర్ తెగి గేదె మీద పడటంతో అక్కడికక్కడే గేదె మరణించింది.దీంతో బాధిత రైతు బోరున విలపించారు.గేదె విలువ సుమారు రూ.1.20 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు. ఇదిలా ఉండగా విద్యుత్ అధికారులు తెగిపడిన తీగలను పట్టించుకోకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత విద్యుత్ అధికారులు స్పందించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
Posted inమద్దూరు
బైరాన్ పల్లిలో విద్యుత్ షాక్ తో పాడే గేదె మృతి





