కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త!…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరి పరీక్ష ఫీజులు స్వయంగా చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్
12,292 మంది విద్యార్థుల ఫీజులుకు ఎంపీ వ్యక్తిగత వేతనం నుంచి ₹15 లక్షల సహాయం
ప్రజల ప్రశంసలు పొందుతున్న కరీంనగర్ ఎంపీ మానవతా నిర్ణయం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ మానవతా దృక్పథంతో ప్రశంసనీయ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులపై పరీక్షల ఫీజు భారం పడకూడదనే ఉద్దేశంతో, ఈ ఏడాది విద్యార్థులందరి మొత్తం పరీక్ష ఫీజును తన వేతనం నుండి చెల్లించనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,292 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లా 4,847 మంది, సిరిసిల్ల 4,059 మంది, సిద్ధిపేట 1,118 మంది, జగిత్యాల 1,135 మంది, హన్మకొండ జిల్లా 1,133 మంది ఉన్నారు. ఈ విద్యార్థులందరి పరీక్ష ఫీజుల కోసం సుమారు ₹15 లక్షలు అవసరం అవుతుందని, ఆ మొత్తాన్ని పూర్తిగా తన వేతనం ద్వారా భరించనున్నట్లు ఎంపీ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు వారి విద్యకు అడ్డంకిగా మారకూడదనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ మాట్లాడుతూ, “దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో, వికసిత్ భారత్ సాధనలో నా వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నాను” అన్నారు.స్థానిక ప్రజలు, ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ఎంపీని అభినందించారు.





