నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం..
విద్యుత్ సమస్యలు ఉంటే సంప్రదించండి..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్స్యూమర్స్ డే) సందర్బంగా వినియోగదారులకు ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే వినియోగదారులు నేడు నవంబర్ 3, సోమవారం సిద్దిపేట లోని విద్యుత్ సర్కిల్ కార్యాలయం లో సంప్రదించి తమ సమస్యలకు పరిష్కారం పొందగలరని సిద్దిపేట జిల్లా సుపరేడెంట్ ఇంజనీర్ టి. ఆర్. చంద్రమోహన్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఈ మాట్లాడుతూ జిల్లా లోని అన్ని విద్యుత్ కార్యాలయాలలో కన్స్యూమర్స్ డే జరుపనున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు అందరు పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.





