మొంథా తుఫాన్ రైతన్న జీవనాన్ని ఛిద్రం చేసింది
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
కోహెడ మండలానికి రాకపోకల కోసం శాశ్వత పరిష్కారం చూపాలి
బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వేంకటేశం
సిద్దిపేట టైమ్స్ కోహెడ:
కోహెడ మండల వ్యాప్తంగా మొంథా తుఫాన్ బీభత్సంతో ఆరుగాలం కష్టపడి సాగుచేసిన చేతికందిన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న నీటమునిగి వేల ఎకరాల్లో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలని బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేశం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురిస్తే కోహెడ మండల ప్రజలకు రోడ్డుపై సరైన వంతెనలు లేక నీటి ప్రవహంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. కోహెడ నుండి సిద్దిపేట వెళ్లే తంగాళ్లపల్లి పిల్లివాగు, కోహెడ నుండి కరీంనగర్ వెళ్లే ఇందుర్తి వాగు, వింజపల్లి స్కూల్ వద్ద, వరికొలు కట్ట వద్ద, కోహెడ టూ హుస్నాబాద్ వెళ్లే కాచాపూర్ వాగు, పోరెడ్డిపల్లి నుండి హుస్నాబాద్ వెళ్లే మోయతుమ్మెద వాగు సరైన ఎత్తైన వంతెనలు లేక జలదిగ్బంధంలో కోహెడ మండల ప్రజలుకు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని దీనిపై రాష్ట్ర మంత్రి చొరవ తీసుకుని ఆయా పరిసరాల్లో ఎత్తైన బ్రిడ్జిలు కట్టించి ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కాకుండా చూడాలని కోరారు.





