తెరుచుకొని పశు వైద్యాశాల..
సిద్ధిపేట టైమ్స్,మద్దూరు:
మద్దూరు మండల కేంద్రంలోని పశు వైద్యాశాల సోమవారం మూతబడి ఉంది.వైద్యాధికారి,సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో పశు వైద్యశాలకు తాళం వేసి ఉండడంతో వివిధ గ్రామాల నుండి వచ్చిన పలువురు రైతులు అసహనం వ్యక్తం చేశారు.చుట్టుపక్కల గ్రామాలకు ఇదిఒక్కటే పశువైద్యశాల అందుబాటులో ఉండడంతో చాలామంది రైతులు వైద్యశాలకు పశువుల చికిత్సల కోసం వస్తుంటారు.సోమవారం అధికారులు అందుబాటులో లేక పశువైద్యశాల తాళం వేసి ఉండడంతో రైతులు వెనుదిరిగి వెళ్లిపోయారు.ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పశు వైద్యాధికారి మద్దూరుతో పాటు ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లి ఇంచార్జ్ పశు వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఆయన ఏనాడు ఈ రెండు ఆసుపత్రులకు వచ్చిన సందర్భాలు లేవని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.పశు వైద్యాధికారులు,సిబ్బందిపై చర్యలు తీసుకొని మూగజీవాలకు వైద్యం అందించాలని రైతులు కోరుతున్నారు.ఈ విషయంపై పశువైద్యాధికారి హరికిషన్ ను వివరణ కోరగా సిబ్బంది అందరూ సెలవులో వెళ్ళినట్లు తెలిపారు.