హుస్నాబాద్ పట్టణంలో మొంథా తుఫాన్ ప్రభావం…. ప్రజల భద్రత కోసం పునరావాస కేంద్రం, హెల్ప్ డెస్క్ ఏర్పాటు
పాత భవనాల్లో నివసించే వారు జాగ్రత్త! …. పాత మున్సిపల్ భవనంలో పునరావాస కేంద్రం
హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 29:
మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా సిద్దిపేట జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. హుస్నాబాద్ పట్టణంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం పురపాలక సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది.పట్టణంలోని పాత మున్సిపల్ భవనం వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ప్రకటించారు. శిధిలావస్థలో ఉన్న లేదా కూలిపోతున్న ఇండ్లలో నివసిస్తున్న వారు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు నూతన పురపాలక సంఘ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (హెల్ప్ డెస్క్)ను సంప్రదించవచ్చు. అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్ డెస్క్ నంబర్లు 7793911994 మరియు 7337347611గా పురపాలక సంఘం వెల్లడించింది. పురపాలక సంఘం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అధికారులు లేదా హెల్ప్ డెస్క్‌ను తక్షణమే సంప్రదించాలని సూచించింది.





