హుస్నాబాద్‌లో పోలీసు అమరవీరుల స్మారకార్థం సైకిల్ ర్యాలీ

హుస్నాబాద్‌లో పోలీసు అమరవీరుల స్మారకార్థం సైకిల్ ర్యాలీ

హుస్నాబాద్‌లో పోలీసు అమరవీరుల స్మారకార్థం సైకిల్ ర్యాలీ

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి ప్రజల్లో దేశభక్తి, సేవా స్పూర్తిని నింపింది. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ ఏసీపీ సదానందం నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ వారి సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలలో పోలీసుల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో, సత్సంబంధాలను బలోపేతం చేయడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు. ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు, యువకులు, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, వివిధ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *