తెలంగాణ యాస భాష ఎంతో కమ్మనైనది..!
ఉద్యమకారులకు సన్మానం..
తెలంగాణ రాష్ట్ర మహిళా నాయకురాలు “ కత్తి కార్తీక గౌడ్”
సిద్దిపేట్ టైమ్స్, దుబ్బాక ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు సందర్భంగా సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా ఉద్యమకారులను సన్మానించాలని బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ నిర్ణయం మేరకు సోమవారం సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులని సన్మానించుకునే భాగంగా కవి గాయకులు నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్, మాజీ శాసనసభ్యులు దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత రామలింగారెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఒంటేరు యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడతల సతీష్ కుమార్,టీఎన్జీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్ , రాజమౌళి పంతులు లు మాట్లాడుతూ…. తెలంగాణ యాస భాషను తక్కువ చేసే రోజుల్లో ఉద్యమస్ఫూర్తితో తెలంగాణ యాస భాషా లో ఉన్న కమ్మదనాన్ని తెలంగాణ సమాజానికి తెలియజేయడంలో తన వంతు ఉద్యమంలో కృషి చేసిన ఉద్యమకారురాలు అయిన తెలంగాణ ఆడబిడ్డ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ ఉద్యమంలో వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారినీ మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించరు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మేల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వారితో పాటు ఈ కార్యక్రమానికి దుబ్బాక మండలంలోని బిఆర్ఏ పార్టీ ఎంపిపి, జడ్పిటిసి అన్ని గ్రామాల ఎంపీటీసీల, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచ్, కో ఆప్షన్ సభ్యులు పీఏ సీఎస్, ఆత్మ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎండోమెంట్ చైర్మన్ డైరెక్టర్స్, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూతు కన్వీనర్స్, మాజీ రైతు సమన్వయ కమిటీ చైర్మన్, మెంబర్స్ , ఎస్ఎంసి మాజీ చైర్మన్,అనుబంధ సంస్థలు గల కార్యకర్తలు, BRSY, BRSV సోషల్ మీడియా ఇన్చార్జులు, వార్డు సభ్యులు, మాజీ ఎంపిటిసిలు, గతంలో వివిధ హోదాలో పనిచేసిన నాయ7కులు యువజన నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.