ప్రజాసేవే తన లక్ష్యం..
కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు..
ఘనంగా కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదిన వేడుకలు..
జన్మదినం సందర్భంగా లక్ష 50 వేల ఆర్థిక సాయం..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, అక్టోబర్ 27:

ప్రజాసేవే తన లక్ష్యమని కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు అన్నారు. కెవిఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి వంశీధర్ రావు హాజరయ్యారు. వంశీధర్ రావు పేరుతో అభిమానులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. వంశీధర్ రావు సైతం స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి కార్యకర్తకు, అభిమానికి కృతజ్ఞతలు తెలుపుతూ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు “కె.వి.ఆర్ జిందాబాద్” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
తర్వాత వంశీధర్ రావు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
“నంగునూరు మండలం, చిన్నకోడూరు మండలాల్లో పేద విద్యార్థులకు ఉచిత డ్రైవింగ్ స్కూల్ ద్వారా లైసెన్సులు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం సిద్దిపేటలో విక్టరీ టాకీస్ చౌరస్తా వద్ద కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయన్నారు. అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధి కోసం వేద సొల్యూషన్ ద్వారా కంప్యూటర్ శిక్షణ, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి వేసవి సెలవుల్లో కె.వి.ఆర్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, ఉచిత వసతులు అందిస్తున్నామన్నారు. నా మిత్రులు, నా కార్యకర్తలు సమాజ సేవలో ముందుండి కల్వకుంట్ల వంశీధర్ రావు ఫౌండేషన్‌ను బలోపేతం చేస్తున్నారని, వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు, స్నేహితుల మధ్య జన్మదిన సంబరాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

జన్మదిన సందర్భంగా లక్ష 50 వేల ఆర్థిక సాయం..
కలకుంట్ల వంశీధర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని కలకుంట్ల వంశీధర్ రావు లక్ష 50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కెవిఆర్ ఫౌండేషన్ సభ్యుడైన ముత్యాల మహేందర్ గతంలో మరణించగా వారి ఇద్దరి కుమారుల పేరిట 50 వేలు, 50 వేల చొప్పున ఇద్దరిపై లక్ష రూపాయల ఫిక్స్ డిపాజిట్ చేసి వారికి బాండ్లు అందజేశారు. అలాగే సిద్దిపేటకు చెందిన ఫోటోగ్రాఫర్ సలారం తిరుమల్ రెడ్డి మృతిచెందగా అంగవైకల్యంతో బాధపడుతున్న వారి ఇద్దరి కుమారులకు 25 వేల చొప్పున 50 వేల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు చేపించి వారికి అందజేశారు.






