హుస్నాబాద్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
అమరవీరుల సేవలను స్మరించుకుందాం — ఏసీపీ సదానందం


సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 21:
పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. విధి నిర్వహణలో భాగంగా 1991లో అమరులైన ఎస్సై జాన్ విల్సన్, సీఐ యాదగిరి, మరియు ఇతర పోలీస్ సిబ్బందికి ఏసీపీ సదానందం, రాజకీయ నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ … “పోలీస్ అమరవీరులు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాలు ఎల్లప్పుడూ పోలీసు విభాగానికి ప్రేరణగా నిలుస్తాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో ఛైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, ఐలేని మల్లికార్జున్రెడ్డి, అన్వర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల స్మారక చిహ్నానికి పూలమాలలు సమర్పించి మౌనం పాటించారు.





