వ్యవసాయం ఎట్లుంది.. అమ్మా..
రైతులతో ముచ్చటించిన హరీశ్ రావు..
గోసపడుతున్నామంటూ సమాధానమిచ్చిన రైతులు..
సిద్దిపేట టైమ్స్, తెలంగాణ
“అమ్మా బాగున్నారా… వ్యవసాయం ఎట్లా నడుస్తోంది” అంటూ రైతులను మాజీ మంత్రి హరీశ్ రావు ఆప్యాయంగా పలకరించారు. “ఏమున్నది సార్.. కేసీఆర్ లేని లోటు కనిపిస్తోంది. అన్నిటికీ ఇబ్బంది అవుతుంది” అంటూ రైతులు సమాధానమిచ్చారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మధ్యాహ్నం భోజనం చేస్తున్న మొక్కజొన్న రైతులతో హరీశ్ రావు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. “యూరియా కోసం రేవంత్ రెడ్డి తిప్పలు పెట్టిండు. సన్నబియ్యం అన్నం ముద్ద అవుతుంది. వ్యవసాయానికి కరెంట్ సరిగా ఇస్తలే” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ” కేసీఆర్, మీ దయవల్లనే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చినయి. కాళేశ్వరం నీళ్లు వచ్చినప్పటి నుంచి రెండు కాదు మూడు పంటలు పంఫిస్తున్నా” మని వారు హరీశ్ తో అన్నారు. మిర్చి పంట వేయక ముందు ‘మేము గుడిడెల్లో ఉండే వాళ్ళం.. ఇప్పుడు మీ దయతో బిల్డింగ్ కట్టుకున్నామ’ని అన్నారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, రైతు రుణమాఫీ చేయలేదని, రైతుబందుకు ఎగనామం పెట్టిండని, యూరియా ఇవ్వకుండా రైతులను అరిగోస పెట్టిండని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఉసురు రేవంత్ కు తప్పక తగులుతుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, ఇతర నాయకులు ఉన్నారు.






