జిల్లెలగడ్డ గురుకులాన్ని సందర్శించనున్న జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలను రేపు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ తెలంగాణ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జి. సునీల్ కుమార్ బాబు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌తో పాటు పలు శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. కమిషన్ సభ్యులు కూడా డైరెక్టర్‌తో కలిసి పాఠశాలలో జరిగిన బాలుడు మృతి చెందిన ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. సమాచారం ప్రకారం, కమిషన్ అధికారులు పాఠశాల పరిస్థితులు, విద్యార్థుల భద్రత, వసతులు, మరియు ఇటీవల జరిగిన ఘటనలపై పూర్తి స్థాయి నివేదికను సేకరించనున్నారు. పాఠశాల నిర్వహణపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకుంటారని అధికారులు తెలిపారు.





