గంజాయి రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత
ఆటో డ్రైవర్లకు గంజాయి పై అవగాహన కార్యక్రమంలో ఏసీపీ సదానందం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్,
హుస్నాబాద్ పట్టణంలో ఆటో డ్రైవర్లకు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ ఏసీపీ సౌదారపు సదానందం ప్రధాన అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గంజాయి రహిత సమాజం నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత. మత్తు పదార్థాల వ్యసనం యువత భవిష్యత్తును దెబ్బతీస్తోంది. అందువల్ల ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లు గంజాయి లేదా మత్తు పదార్థాలను సరఫరా చేసే వ్యక్తులను అనుమానాస్పదంగా గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. పట్టణంలో గంజాయి రవాణా, సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాల దుర్వినియోగం కారణంగా కుటుంబాలు, సమాజం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని ఏసీపీ సదానందం హెచ్చరించారు. యువతను సరైన దారిలో నడిపించేందుకు పోలీసు శాఖతో పాటు సామాజిక సంస్థలు, పౌరులు కలసి పని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Posted inహుస్నాబాద్
గంజాయి రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత





