హాస్టల్ డైలీవేజ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించండి
బీఆర్‌ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్,
హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలోని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాల ముందు జరుగుతున్న హాస్టల్ డైలీవేజ్ వర్కర్స్ నిరవధిక సమ్మెకు బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాస్టల్ డైలీవేజ్ వర్కర్లు నెలలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సంవత్సరాలుగా పనిచేస్తున్న వర్కర్లకు పర్మినెంట్ చేయకపోవడం, జీతాలు ఆలస్యంగా చెల్లించడం దారుణమన్నారు. కనీస వేతనాలు సైతం సరైన సమయానికి అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉన్నామని చెబుతూ ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శించారు. డైలీవేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులను ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మేకల వికాస్ యాదవ్, మాలోత్ సత్యం నాయక్, మాలోత్ గంగాసింగ్, నూనవత్ రమేష్, లావుడ్యా కిసన్, బాలు, శారదా తదితరులు పాల్గొన్నారు.
Posted inహుస్నాబాద్
హాస్టల్ డైలీవేజ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించండి





