మహిళ ప్రాణాలను కాపాడిన డయల్ 100 కాల్… అభినందించిన జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు
సిద్దిపేట్ టైమ్స్ మెదక్ ప్రతినిధి అక్టోబర్ 11
హవెలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్సంపల్లి నుండి డయల్ 100కి కాల్ వచ్చింది. సమాచారం ప్రకారం, జ్యోతి అనే మహిళ తన ఇంటిలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని సమాచారం అందించారు. తక్షణమే, వరప్రసాద్ (లడ్డు), జైయానంద్, రమేష్ ముగ్గురు 5 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వరప్రసాద్ (లడ్డు) హోం గార్డు వెంటనే స్పందించి గడ్డపర ద్వారా ఇంటి తలుపులను పగలగొట్టి, తక్షణ CPR చేసి, వరప్రసాద్, జైయానంద్, రమేష్ ల సహకారంతో మహిళను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎస్పీ ఆదేశాల మేరకు ఎసై.నరేష్ కూడా ఆసుపత్రికి వెళ్లి ఆమెకు మెరుగైన వైద్యం అందించలని సూచించారు . ఈ అత్యవసరమైన, వేగవంతమైన స్పందన వల్ల మహిళ ప్రాణాలను కాపాడినందుకు జిల్లా ఎస్పీ వరప్రసాద్(లడ్డు), జైయానంద్, రమేష్ ను అభినందించారు.






