ధూళిమిట్టలో వృద్ధుడిపై కోతుల దాడి… తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు
సిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట (అక్టోబర్, 10):
ధూళిమిట్ట మండల కేంద్రంలో ఓ వృద్ధుడిపై కోతుల గుంపు దాడి చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధూళిమిట్ట మండలం కేంద్రానికి చెందిన తుషాలపురం మల్లయ్య(70) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక్కసారిగా కోతుల గుంపు ఆయనపై దాడి చేశాయి. దీంతో మల్లయ్య భయంతో కేకలు వేయగా స్థానికులు వచ్చి కర్రలతో కోతులను తరిమికొట్టారు. ఈ దాడిలో మల్లయ్యకు ప్రాణాపాయం తప్పినా, తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు మల్లయ్యను చికిత్స కోసం నంగునూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి మెరుగైన చికిత్సకోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కోతుల బెడద పెరిగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Posted inబ్రేకింగ్ న్యూస్ మద్దూరు సిద్దిపేట
ధూళిమిట్టలో వృద్ధుడిపై కోతుల దాడి… తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు





