నూతన పోలీస్ కమిషనర్ కి సవాళ్లెన్నో..
ఐదవ పోలీస్ కమిషనర్ గా విజయ్ కుమార్..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి, అక్టోబర్ 06
సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత ఐదవ పోలీస్ కమిషనర్ గా విజయ్ కుమార్ వచ్చారు. నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ కు ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.
సిద్దిపేట నూతన జిల్లా ఏర్పడిన అనంతరం తొలి జిల్లా సీపీ గా శివకుమార్, రెండవ సీపీ గా జోయల్ డేవిస్ పనిచేశారు. మూడో సీపీ గా శ్వేత నాలుగవ సీపీ గా అనురాధ, ఐదవ సీపీ గా విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. నిక్కచ్చిగా ముక్కుసూటి ఐపీఎస్ అధికారి గా మంచి పేరు ఉన్న విజయ్ కుమార్ రాకతో జిల్లాలో పలు మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు విజయ్ కుమార్ రాకతో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని కొన్ని తాళాలు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయి. ఏకంగా పోలీసులే పంచాయతీలు బూసెట్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి..
రౌడీ షీటర్లలోను అసాంఘిక శక్తుల పట్ల వత్తాసు పలికేవారిలో వణుకు ప్రారంభమైందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. గతంలో జిల్లాలో విచ్చలవిడిగా మట్కా, అక్రమ వ్యాపారాలపై, జూదం, పేకాట క్లబ్బులపై నిఘా లోపించిందని ప్రజల్లో ఓ అభిప్రాయం ఉంది. దీనికి తోడు పోలీస్ స్టేషన్లో భూ సెటిల్మెంట్లు, తానాలే పంచాయతీ కేంద్రాలుగా మారాయని.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా మట్కా, గంజాయి పేకాట, బియ్యం కేసులు తక్కువ నమోదు కావడం జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, ఇటీవల కాలంలో జిల్లాలో పోక్సో కేసులు పెరిగి పోవడంతో జిల్లాలోని చట్టవ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. మహిళల భద్రత, బాలల రక్షణలో పోలీసులు చురుగ్గా వ్యవహరించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, అధిక వడ్డీ వ్యాపారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేదని జిల్లా ప్రజల నుంచి ఆరోపణలు వినిపించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ బాధ్యత సాఫీగా సాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ పై జిల్లా ప్రజలు కొండంత ఆశతో ఉన్నారు





