ఆకాశంలో అరుదైన అద్భుతం..
సాధారణ పౌర్ణమి కంటే 14% పెద్ద, 30% 2 వెలుగుతో చంద్రుడు..
నవంబర్, డిసెంబర్లో దర్శనమివ్వనున్న మరో రెండు సూపర్ మూన్స్..
సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 05;
ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం ఈసారి భారతదేశ ఆకాశాన్నీ ప్రకాశవంతం చేయబోతోంది. నేడు (సోమవారం), రేపు (మంగళవారం) సూపర్ మూన్ రూపంలో ఆకాశం అందాల పండుగను సాక్షాత్కరించనుంది.
ఈసందర్భంగా చంద్రుడు సాధారణపౌర్ణమి రోజుల్లో కనిపించే దానికంటే మరింత పెద్దగా, మరింత ప్రకా శవంతంగా కనిపించనున్నాడు. భూమి చుట్టూ తిరు గుతున్నప్పుడు చంద్రుడు కొన్నిసందర్భాల్లో భూమికి అత్యంత సమీపంగా వస్తాడు. ఆ సమయానికేపౌర్ణమి తారీఖు రావడంతో సూర్యకాంతి మొత్తం చంద్రునిపై ప్రతిఫలించి అతని ప్రకాశం అనూహ్యంగా పెరుగు తుంది. ఈ సందర్భాన్నే ఖగోళ శాస్త్రజ్ఞులు “సూపర్ మూన్” అని పిలుస్తారు. ఖగోళ పరిశోధకుల వివరాల ప్రకారం .. ఈ సూపర్ మూన్ సమయంలో చంద్రుడి పరిమాణం సాధారణ పౌర్ణమి చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, అలాగే 30 శాతం ఎక్కువ వెలుగుతో కనిపించనుంది. అంటే ఆకాశం అంతా చంద్రకాంతితో నిండిపోతుంది. నగరాల వెలుగులు తగ్గిన ప్రాంతాలు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సూపర్ మూన్ అద్భుతంగా దర్శనమిస్తుంది.
ఇక ఇది చివరి త్రైమాసికానికి ముందురోజులలో కనబడే సూపర్ మూన్ కావడంతో, దీనిని “హార్వెస్ట్ మూన్” అని కూడా పిలుస్తారు. సంప్రదాయంగా ఈ కాలంలో రైతులు పంటలు కోసే సీజన్ కావడంతో, రాత్రి వెలుతురు ఎక్కువగా ఉండే ఈ పౌర్ణమిని ఆ పేరు పెట్టారు. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా మరో రెండు సూపర్ మూన్స్ దర్శనమివ్వనున్నాయి. దీంతో ఖగోళ ప్రేమికులు, ఆ వీక్షకులు ఈ మూడు చంద్ర దర్శనాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. సూపర్ మూన్ను ప్రత్యేక పరికరాలు లేకుండానే కన్నులారా వీక్షించవచ్చు. కానీ, ఆకాశం స్పష్టంగా ఉండే ప్రాంతాలను చూడడం ఉత్తమం. వాతావరణం మబ్బుగా లేకపోతే, చంద్రుడు తన సంపూర్ణ కాంతితో ప్రజలకు కనువిందు చేయనున్నాడు.





