బహుజనుల ఐక్యతతో అధిక సీట్లు గెలుద్దాం
బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 5:
సిద్దిపేట జిల్లాలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బహుజనుల ఐక్యతతో ఎక్కువ సీట్లు గెలవాలని బహుజన సమాజ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ పట్టణంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “జిల్లాలో ఉన్న 26 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. బహుజనుల ఐక్యతతో ఈ లక్ష్యాన్ని సాధించగలము” అని విశ్వాసం వ్యక్తం చేశారు.తదుపరి మాట్లాడుతూ, బీఎస్పీ పార్టీ మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అగ్రవర్ణ పేదల హక్కుల కోసం నిస్వార్థంగా పనిచేస్తుందని ఉమేష్ తెలిపారు. ఇతర పార్టీలు బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నాయని, రోజుకో మాటతో బీసీ బిల్లును దుర్వినియోగం చేస్తూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవాన్ని గమనించి, రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్చార్జి డేగల వెంకటేష్, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, అధ్యక్షులు వెలుపుల రాజు, పార్టీ నాయకులు బోయని బాబు, మారేపల్లి సుధాకర్, హనుమంతు, రాంబాబు, భూసమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.





