పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
సిద్దిపేట టైమ్స్, (అక్టోబర్,04):
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నారదాసు శ్రీకాంత్ (27) శుక్రవారం రాత్రి ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు.గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి శ్రీకాంత్ మరణించాడు.
Posted inబ్రేకింగ్ న్యూస్ మద్దూరు సిద్దిపేట
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య





