ఒకేసారి 6 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన మూడావత్ ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ అక్కన్నపేట:
సిద్దిపేట జిల్లా, అక్కనపేట మండలం బడితండాకు చెందిన మూడావత్ ప్రభాకర్ ఒకేసారి ఆరు ప్రభుత్వ ఉద్యోగాలలకు ఎంపికై తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం హుస్నాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ లో గ్రూప్ ఫోర్ జాబ్ చేస్తున్న ప్రభాకర్ పంచాయతీ కార్యదర్శి, రైల్వే గ్రూప్–డి, సివిల్ కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్, గ్రూప్–2 లో టెక్స్టైల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అలాగే గ్రూప్–3 లో 1:1 పోస్టుల్లో విజయం సాధించడం గమనార్హం. ప్రభాకర్ తండ్రి మూడావత్ జలం వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తుండగా, ఇద్దరు అన్నలు స్కూల్ అసిస్టెంట్ టీచర్లుగా పనిచేస్తున్నారు. కష్టపడి చదివి, నిరంతర శ్రమతో విజయాలు సాధించగలమనే దానికి ప్రభాకర్ ఆదర్శంగా నిలిచారు. ఒకే సారి ఆరు ఉద్యోగాల్లో ఎంపిక కావడం ప్రాంతంలో విశేషంగా మారింది. బడితండా, గండిపల్లి ప్రజలు ప్రభాకర్ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.





