రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు – మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందేశం విడుదల చేశారు. చెడు పై మంచి సాధించిన విజయాన్ని ప్రతిబింబించే పండుగే దసరా (విజయదశమి) అని పేర్కొంటూ, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు శమీ పూజ చేసి, జమ్మి ఆకును బంగారంగా భావిస్తూ అలయ్ బలాయ్ చేసుకోవడం, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, పాలపిట్ట దర్శనం మన సంప్రదాయాల్లో ప్రత్యేకతగా ఉంటుందని మంత్రి గుర్తుచేశారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, విజయదశమి నుంచి ప్రజల జీవితాల్లో మరిన్ని విజయాలు, ఆనందాలు చేరాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆయన ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి పర్వదినం సుభిక్షం, ఐశ్వర్యం కలగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.





