హుస్నాబాద్‌లో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్లో గురువారం మహిళల రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చేర్యాల–హుస్నాబాద్ షీటీమ్ బృందం ఏఎస్ఐ సదయ్య, మహిళ కానిస్టేబుళ్లు ప్రశాంతి, స్వప్న, కానిస్టేబుళ్లు కృష్ణ, బాబు పాల్గొని వివిధ అంశాలపై సూచనలు ఇచ్చారు. మహిళలకు రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి సామాజిక రుక్మతల గురించి విపులంగా వివరించారు. అపరిచితుల లింకులు ఓపెన్ చేయకూడదని, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని, సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 నెంబర్‌కి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తుల వాగ్దానాలను నమ్మవద్దని, వ్యవసాయ పనులకు ఒంటరిగా వెళ్లేటప్పుడు బంగారం ధరించకూడదని మహిళలకు హెచ్చరికలు ఇచ్చారు. వేధింపులు ఎదురైనప్పుడు వెంటనే డయల్ 100 లేదా షీటీమ్ నెంబర్ 8712667434 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని, ఫిర్యాదు దారుల పేర్లు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. మహిళల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని షీటీమ్ స్పష్టం చేసింది.
Posted inహుస్నాబాద్
హుస్నాబాద్‌లో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం





