గంజాయి తాగుతూ విక్రయానికి యత్నించిన ముగ్గురి అరెస్ట్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలోని మహ్మదాపూర్ రోడ్డులో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం అందడంతో, టాస్క్ ఫోర్స్ పోలీసులు, హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిబ్బందితో కలిసి దాడి చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు పరారీలో ఉన్న వంశీ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు. నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి చుక్క అనిల్ (24), డబుల్ బెడ్ రూమ్, హుస్నాబాద్. బూర్ల రాకేష్ (24), బాలాజీ నగర్, హుస్నాబాద్. మదన అభినయ్ (19), డబుల్ బెడ్ రూమ్, హుస్నాబాద్. వంశీ, కరీంనగర్ (పరారీలో ఉన్నాడు). నిందితుల నుండి 200 గ్రాముల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు లను స్వాధీనం చేసుకున్నారు.
సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలు, హోటళ్లు, కళ్లుదీపోలు, ఇతర ప్రదేశాలలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 100కి లేదా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ నంబర్లకు (8712667445, 8712667446, 8712667447) సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కదలికలపై జాగ్రత్తగా నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి కలిగి ఉన్న లేదా విక్రయించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
Posted inహుస్నాబాద్
గంజాయి తాగుతూ విక్రయానికి యత్నించిన ముగ్గురి అరెస్ట్





