హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహన వేలం

హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో ద్విచక్ర వాహన వేలం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 23 :


హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో గతంలో పట్టుబడిన ఒక టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంను వేలం వేయనున్నారు. ఈ వేలంపాట బుధవారం, 24-09-2025 ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ స్టేషన్ ప్రాంగణంలో జరగనుంది. ఈ విషయాన్ని స్టేషన్ సీఐ పవన్ తెలియజేస్తూ, ఆసక్తి గల వ్యక్తులు ముందుగా స్టేషన్‌లో రశీదు పొంది వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలంపాట ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడుతుందని, వాహనంపై ఆసక్తి ఉన్నవారు సమయానికి హాజరై పాల్గొనాలని సూచించారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *