హుస్నాబాద్ లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
ఆడపడుచులతో బతుకమ్మ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు కాలనీల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీక. తొమ్మిది రోజుల పాటు ఎంగిలిపుల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు జరిగే వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం” అని పేర్కొన్నారు. “హుస్నాబాద్ ఆడపడుచులకు, తెలంగాణ అక్కాచెల్లలకు తొలి రోజు ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ పండగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి. ప్రజలందరికీ శుభం జరగాలని ఆకాంక్షిస్తున్నాం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ ప్రజలు పండగను ఉత్సాహంగా, ఐక్యంగా జరుపుకోవాలని మంత్రి కోరారు.






