బతుకమ్మ–దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ మరియు దసరా పండగల ఏర్పాట్లపై అన్ని పార్టీల నాయకులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బిజెపి, బీఎస్పీ పార్టీ నాయకులు పాల్గొని పండగల ఏర్పాట్లపై తమ సూచనలు తెలిపారు. పండగలు శాంతి భద్రతల మధ్య, ఘనంగా జరగడానికి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. బతుకమ్మ పండుగకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్ దీపాలంకరణ, తాగునీటి సదుపాయాలు, శానిటేషన్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అన్ని పార్టీల నాయకులు పండగల సందర్భంలో ప్రజలు సౌకర్యంగా, ఆనందంగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.






