మాంటిస్సోరి హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కృష్ణవేణి (మాంటిస్సోరి) హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై, పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ, “వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మను పేర్చడం ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. పూల మాదిరిగానే మనుషులంతా కలిసిమెలిసి ఉంటే సమాజం మరింత అందంగా, సమన్వయంతో ఉంటుంది” అని అన్నారు. డైరెక్టర్లు కె. రవీందర్, షాజు థామస్, ఉపాధ్యాయులు ఈ వేడుకలో పాల్గొని విద్యార్థినులను అభినందించారు. బతుకమ్మ పండుగను ముందుగానే జరుపుకోవడంతో విద్యార్థినుల్లో ఉత్సాహం నిండిపోయింది. పూల సుగంధంతో, పాటల నినాదాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.






