హుస్నాబాద్‌లో ముందస్తు బతుకమ్మ సంబరాలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
పట్టణంలోని శివాజీ నగర్ హనుమాన్ దేవస్థానం సమీపంలో ధర్మవీర్ యోగా శిక్షణ ఆధ్వర్యంలో గురువారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ బద్దంగా, డీజే లేకుండా, కాలుష్య సమస్యలు లేకుండా పూర్వపు బతుకమ్మ పాటలతో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ధర్మవీర్ యోగా శిక్షకురాలు అయిలేని అనితా దేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. యోగ సాధకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, కొంకటి నళిని, వాల సుప్రజ, భోజు రమాదేవి తదితరులు పాల్గొని బతుకమ్మ ఆడారు. స్థానిక మహిళలు, యువతులు పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ గీతాలతో పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.






