భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షురాలు కాదాసు దీపికా, మహిళా మోర్చా నాయకురాలు లకావత్ శారద ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో “ఆత్మనిర్భర్ భారత్ – వికసిత్ భారత్” అంశాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించబడ్డాయి. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు. మొదటి బహుమతి కె. వెన్నెల (10వ తరగతి, టీఎస్ మోడల్ స్కూల్), రెండో బహుమతి – బి. రిషికా (9వ తరగతి, సెయింట్ జోసెఫ్ స్కూల్), మూడో బహుమతి – జి. నేత్ర (9వ తరగతి, టీఎస్ మైనారిటీ స్కూల్) అలాగే కన్సోలేషన్ బహుమతులుగా పెన్లు అందజేయబడ్డాయి.
ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల్లో దేశభక్తి, పోటీ తత్వం, దేశ పట్ల అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విద్యాలక్ష్మి, పీఎం శ్రీ పథకం వంటి కార్యక్రమాలను వివరించారు. మోదీ నాయకత్వంలో భారత్ వికసిత్ భారత్‌గా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గాదాసు రాంప్రసాద్, కార్యదర్శులు బొప్పిశెట్టి సాయిరామ్, వడ్డెపల్లి లక్ష్మయ్య, అకోజు అరుణ్ కుమార్, శక్తికేంద్ర ఇంచార్జి నారోజు నరేష్, పార్టీ సీనియర్ నాయకులు తోట సమ్మయ్య, వరియోగుల అనంతస్వామి, పోలోజు రవీందర్, ఇల్లెందుల తిరుపతి, పోగుల శేఖర్, మహిళా నాయకురాళ్లు రేణుక, శివాణి, లక్ష్మి, అరుణ, కావ్య, సంధ్య, రమ్యతో పాటు పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







