సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు అరికట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెట్రోపాలిటన్ కోర్టు న్యాయవాది అరుణ్ కుమార్, మరియు ఇతర న్యాయవాదులపై జరిగిన దాడిని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని ధర్నా చేస్తుంటే పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువచ్చి, అక్రమంగా అరెస్టు చేసిన న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కన్నుజ్ రామకృష్ణ, జూన్లాల్ నాయక్, కొత్తపల్లి దేవేందర్, ఆకుపత్తిని బాలకిషన్, జేరిపోతుల రవీందర్, గాలి పల్లి రఘువీర్, జల జ్యోతి కుమార్, కొంకట శ్రీనివాస్, దీకొండ ప్రవీణ్ కుమార్, చింతకింది భాస్కర్, ఏల సూర్యప్రకాశ్ రెడ్డి, జగత్ పాల్ అజయ్, బత్తుల అరుణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.






