ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పాలశీతలీకరణ కేంద్రం సందర్శన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు బుధవారం హుస్నాబాద్ లోని కరీంనగర్ డైరీ కూలింగ్ యూనిట్ ని సందర్శించి పాల సేకరణ, పాల నిలువ, పాలను శీతలీకరించడం, పాల యొక్క నాణ్యతను తెలుసుకోవడం, పాలలో ఏ విధంగా కల్తీ జరుగుతుంది, డైరీ ఫార్మ్ ను విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తు వ్యాపార అవకాశం గా మలుచుకోవాలని డైరీ యూనిట్ డైరెక్టర్ సిహెచ్ నాగయ్య సూచించారు. హుస్నాబాద్ పరిసర 39 గ్రామాల నుండి పాలను సేకరిస్తామని ఏ రోజుకు ఆ రోజు కరీంనగర్ లోని సెంట్రల్ డైరీ ఫార్మ్ యూనిట్ కి తరలిస్తామని, పాలను మైనస్ ఫోర్ డిగ్రీస్ వద్ద నిలువ చేస్తామని విద్యార్థులకు పలు విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది. పాల సహకార సంఘంలో సభ్యులైన రైతులకు బీమా, పశువుల దాన, నాణ్యమైన బ్రీడ్స్ ని అందిస్తున్నామని, వారి పిల్లల చదువుల ఖర్చులను, వారి పిల్లల పెళ్లిళ్లకు పుస్తె మట్టెలు, వారి పిల్లల చదువులకు స్కాలర్షిప్ లను ప్రతి సంవత్సరం ప్రోత్సాహంగా అందిస్తున్నామని, డైరీ ఫార్మ్ లోవచ్చే లాభాలని సహకార సంఘంలోని మెంబర్స్ కి చేరేలాగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి ఈ క్షేత్ర పర్యటనలో పాల్గొన్న విద్యార్థులను మరియు బోధన సిబ్బందిని అభినందించారు. ఈ క్షేత్ర పర్యటనను కళాశాలలోని ఎంటర్ప్రేన్యూయువర్ డెవలప్మెంట్ సెల్ (ఇ.డి. సెల్) కన్వీనర్ డాక్టర్ ఇందిరానయనా దేవి పర్యవేక్షించారు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ బాలరాజు, ఆర్ కుమారస్వామి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.





