ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న హింసను చరిత్ర మరచిపోదు..జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగుర వేసి ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ విలీనం చారిత్రక ఘట్టం అని భారతదేశం 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం పొందగా, ఒక సంవత్సరం తరువాత 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిందని గుర్తు చేశారు. నిజాం నవాబు పాలనలో తెలంగాణ ప్రజలు అమానుష హింసకు గురయ్యారని, మహిళలను అవమానించారని సురేందర్ రెడ్డి విమర్శించారు. ఆ కాలంలో నిజాం చేసిన క్రూరత్వాలను చరిత్ర ఎప్పటికీ మరవదని పేర్కొన్నారు. అంతేకాకుండా, అలాంటి పాలకుడిని గతంలో “తెలంగాణ కింగ్”గా గౌరవించడం అనేది దోర అహంకారానికి పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గోళ్లపెల్లి వీరాచారి, మాజీ సర్పంచ్ అన్నాడి దినేష్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్, బోడిగే వెంకటేష్, కాదాసు దీపికా, ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు అకోజు అరుణ్ కుమార్, వడ్డెపల్లి లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, నారోజు నరేష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





