హుస్నాబాద్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
మున్సిపాలిటీ లో జంక్షన్ ల సుందరీకరణ , సెంట్రల్ లైటింగ్, స్వాగత తోరణాలతో అభివృద్ధి చేస్తున్నాం..
గ్రామాల్లో ఏ సమస్య ఉన్న పరిష్కారం చేస్తున్నాం.
నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం అవుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటనలో భాగంగా సైదాపూర్, కోహెడ, హుస్నాబాద్ మున్సిపాలిటీలలో సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
బంజేరుపల్లి – పందిళ్ళ – గొల్లపల్లి రోడ్ (₹2.47 కోట్లు), పొట్లపల్లి – పరివేద రోడ్ (₹2.07 కోట్లు), హుస్నాబాద్ టౌన్ పల్లె చెరువు అభివృద్ధి (₹2 కోట్లు), సెంట్రల్ అవెన్యూ ప్లాంటేషన్ & సుందరీకరణ (₹3 కోట్లు) వంటి పలు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కోహెడ మండలంలోని నారాయణపూర్ వద్ద ₹91.55 లక్షలతో హైలెవల్ బ్రిడ్జి, కాచాపూర్ రోడ్డుపై మరో ₹57 లక్షలతో హైలెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభించారు.
సైదాపూర్ మండలంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాలు, అంగన్వాడీలు, ఓపెన్ జిమ్‌లు, డార్మెంటరీ హాళ్లు, మురికి కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు పంపిణీ చేశారు. హుస్నాబాద్ బస్ స్టాండ్ వద్ద 1932లో నిజాం కాలం నాటి ఆల్బియన్ బస్ మోడల్‌ను ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… “హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. రోడ్లు, బ్రిడ్జీలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీలు, జంక్షన్ డెవలప్మెంట్, సెంట్రల్ లైటింగ్ వంటి పనులు వేగంగా పూర్తిచేస్తాం. నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్‌ను విద్య, పరిశ్రమలు, టూరిజం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం” అని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం–అభివృద్ధి రెండూ సమానంగా కొనసాగుతున్నాయని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు వంటి పథకాలను ప్రజలకి అందజేస్తున్నామని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు హైమవతి, పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.





