రాష్ట్రంలో మరో 4 రోజులపాటు వర్షాలు..
సిద్దిపేట టైమ్స్, తెలంగాణ : రాష్ట్రంలో మరో 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి.





