హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో “ఒక ఉద్యోగి ఒక మొక్క” కార్యక్రమం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: ఒక ఉద్యోగి ఒక మొక్క – ఏక్ పెడ్ మాకే నామ్ (తల్లి పేరున ఒక మొక్క) కార్యక్రమం లో భాగంగా మంగళవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందని తెలిపారు. “ప్రతి ఉద్యోగి నాటిన మొక్కకు జియో ట్యూగింగ్ చేసి, సంరక్షించే బాధ్యత ఆ ఉద్యోగిదే” అని ఆయన స్పష్టం చేశారు.
“నేటి మొక్కలే రేపటి వృక్షాలు. భావితరాలకు సమతుల్యమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి మొక్కలు అత్యంత కీలకం. అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి” అని ఏసీపీ సదానందం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.
Posted inహుస్నాబాద్
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో “ఒక ఉద్యోగి ఒక మొక్క” కార్యక్రమం





