పిడుగుపాటుకు పాడి గేదె మృతి
సిద్ధిపేట టైమ్స్,మద్దూరు ప్రతినిధి:
మద్దూరు మండలంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడి మండల పరిధిలోని వల్లంపట్ల గగ్రామం రైతు నారదాసు రవికి చెందిన పాడి గేదె మృతి చెందింది.గేదె మృతితో రూ.80 వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు.రైతు నారదాసు రవిని ప్రభుత్వం ఆదుకోవాని గ్రామస్తులు కోరారు.