నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..
కవిత కామెంట్స్ పై హరీష్ రావు రియాక్షన్..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట బ్యూరో
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు అని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాల్సిన బాధ్యత నాపై ఉందని, నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. నాపై, పార్టీపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.
విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శల పై స్పందించారు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిగని.. గత కొంతకాలంగా మా పార్టీ పైన నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే కవిత కూడా చేయడం జరిగిందన్నారు. కవిత ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు.. అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటు చెప్పుకొచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బిఆర్ఎస్ పార్టీ ని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు.





