హుస్నాబాద్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
నిమజ్జనంపై కఠిన పర్యవేక్షణ – ప్రజలు సూచనలు పాటించాలి : ఏసిపి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 5:

హుస్నాబాద్‌లో జరుగుతున్నది వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏసిపి సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏసిపి సదానందం మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం నిర్వహించే ఆర్గనైజర్లు, కార్యవర్గ సభ్యులు, భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ, భక్తిశ్రద్ధల మధ్య ఆనందోత్సవాలుగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
అంతేకాకుండా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.





