హుస్నాబాద్‌లో పాఠశాల క్రీడా సమాఖ్య టోర్నమెంట్ విజయవంతం

హుస్నాబాద్‌లో పాఠశాల క్రీడా సమాఖ్య టోర్నమెంట్ విజయవంతం



హుస్నాబాద్‌లో పాఠశాల క్రీడా సమాఖ్య టోర్నమెంట్ విజయవంతం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

ఈనెల 2వ తేదీ నుంచి 69వ హుస్నాబాద్ మండల పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో, ఎం.ఈ.ఓ. బండారి మనీలా నాయకత్వంలో హుస్నాబాద్ మినీ స్టేడియంలో ప్రారంభమైన మండల స్థాయి పాఠశాల క్రీడల టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. వివిధ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

14 సంవత్సరాల బాలికల విభాగం

కోకో: మొదటి స్థానం – మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల హుస్నాబాద్, ద్వితీయ స్థానం – సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల బెజ్జంకి

కబడ్డీ: మొదటి స్థానం – కేజీబీవీ హుస్నాబాద్, ద్వితీయ స్థానం – మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల హుస్నాబాద్

వాలీబాల్: మొదటి స్థానం – మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల హుస్నాబాద్, ద్వితీయ స్థానం – కేజీబీవీ హుస్నాబాద్


17 సంవత్సరాల బాలికల విభాగం

ఖో ఖో: మొదటి స్థానం – మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల హుస్నాబాద్, ద్వితీయ స్థానం – కేజీబీవీ హుస్నాబాద్

ఖో ఖో (మరో విభాగం): మొదటి స్థానం – మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల హుస్నాబాద్, ద్వితీయ స్థానం – మహాత్మ జ్యోతిబాపూలే హుస్నాబాద్

వాలీబాల్: మొదటి స్థానం – మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల హుస్నాబాద్, ద్వితీయ స్థానం – ఆశ్రమ పాఠశాల మీర్జాపుర్


14 సంవత్సరాల బాలుర విభాగం

ఖో ఖో: జాయింట్ విన్నర్స్ – బాలుర పాఠశాల హుస్నాబాద్, ద్వితీయ స్థానం – సోషల్ వెల్ఫేర్ పాఠశాల జిల్లెళ్ళగడ్డ

కబడ్డీ: మొదటి స్థానం – టీజీ మోడల్ స్కూల్ హుస్నాబాద్, ద్వితీయ స్థానం – టీజీ ఆశ్రమ పాఠశాల హుస్నాబాద్

వాలీబాల్: మొదటి స్థానం – సెయింట్ జోసెఫ్ పాఠశాల హుస్నాబాద్, ద్వితీయ స్థానం – జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) హుస్నాబాద్


17 సంవత్సరాల బాలుర విభాగం

ఖో ఖో: మొదటి స్థానం – జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల) హుస్నాబాద్, ద్వితీయ స్థానం – సోషల్ వెల్ఫేర్ పాఠశాల జిల్లెళ్ళగడ్డ

కబడ్డీ: మొదటి స్థానం – టీజీ ఆశ్రమ పాఠశాల హుస్నాబాద్, ద్వితీయ స్థానం – సోషల్ వెల్ఫేర్ పాఠశాల జిల్లెళ్ళగడ్డ

వాలీబాల్: మొదటి స్థానం – సోషల్ వెల్ఫేర్ పాఠశాల జిల్లెళ్ళగడ్డ, ద్వితీయ స్థానం – ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల జిల్లెళ్ళగడ్డ


ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు గద్దల రమేష్, మడక కృష్ణ, కబడ్డీ కన్వీనర్ బి. శ్రీనివాస్, పి.డి.లు జి. రాజారెడ్డి, శ్రీనివాస్, అజయ్, అలాగే ఆర్. శ్రీనివాస్ (స్కూల్ గేమ్స్ సెక్రటరీ), రాజు, స్వప్న, శ్రీలత, భాగ్యశీల, కళావతి, లక్ష్మణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ క్రీడలకు సహకరించిన సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ రెడ్డి కి, మల్లారెడ్డి మోహన్ రెడ్డి కి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *