వినాయకుని సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పూజలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజులుగా పూజలు అందుకొని నేడు నిమజ్జనం అవుతున్న విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాల ద్వారా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ విజ్ఞేశ్వరుని కటాక్షంతో హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో కలకలలాడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాధునికి ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఉండాలని అన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.





