ఎల్లమ్మ చెరువులో వినాయక ఘాట్ పరిశీలన
భద్రతా చర్యలు పటిష్టం.. జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
మంత్రి పొన్నం ఆదేశాల మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ఎల్లమ్మ చెరువులో వినాయక ఘాట్‌ను పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. ఘాట్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేసి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని ఆయన అధికారులకు సూచించారు. తదుపరి బతుకమ్మ ఘాట్‌ను కూడా ఆయన పరిశీలించారు. అతి త్వరలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తారి రవీందర్, చిత్తారి పద్మ, మ్యాదరబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Posted inతాజావార్తలు
ఎల్లమ్మ చెరువులో వినాయక ఘాట్ పరిశీలన





