రేవు సిద్దిపేట పలు వార్డులకు నీటి సరఫరాలో అంతరాయం..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట
సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు మంచి నీటీ సరఫరాలో అంతరాయం ఉంటుందని, ఇది గమనించి ప్రజలు నీటిని వాడుకోవాలని సిద్దిపేట మున్సిపల్ కమీషనర్ అశ్రిత్ కుమార్ తెలిపారు.
పట్టణానికి సరఫరా లోయర్ మానేరు జలాశయం ద్వారా త్రాగునీరు సరఫరా చేయు, 600mm డాయ పైప్ లైన్ ఇల్లంతకుంట గ్రామం వద్ద లీకేజీ అయినందున, ఆ లీకేజీలను అత్యవసరంగా మరమత్తు పనులు చేపట్టవలసి ఉన్నందున నీటి సరఫరా కు అంతరాయం కలుగుతుందన్నారు. సిద్దిపేట మున్సిపల్ వార్డు నెంబర్ 17,18, 19, 20, 21 ,మరియు 35, 36, 37 వార్డులకు సోమవారం రోజున నీటి సరఫరా నిలిపివేసి, లీకేజీలను మరమ్మత్తు చేసి తిరిగి మంగళవారం రోజున నీటి సరఫరా యధావిధిగా జరుగుతుందని తెలిపారు. ఆయా వార్డ్ ల ప్రజలు నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని సూచించారు.





