తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చాలి.
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కెసిఆర్ పదేండ్ల పాలనలో న్యాయం నలిగిపోయి అబద్ధాలను నిజంగా, నిజాన్ని అబద్ధాలుగా చిత్రికరించిన కెసిఆర్ తెలంగాణ ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మానసిక క్షోభకు గురి చేసి ఇటివల తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో కెసిఆర్ ఇప్పుడు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ అన్నారు. ఆదివారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి,సింగిరెడ్డి అమరుల భవన్ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గడిపె మల్లేశ్ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నేరవేర్చే దిశగా అడుగులు వేయాలని గడిపె మల్లేశ్ కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి ఎగ్గోజు సుదర్శన్ చారి ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజు కుమార్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, సిపిఐ నాయకులు అయిలేని మల్లారెడ్డి, కాల్వల ఎల్లయ్య, చుక్క తిరుపతి, దండుగుల ఎల్లయ్య, మహ్మద్ అంకుశావలి, పెట్టుగడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.






