మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలకు హుస్నాబాద్‌లో బీజేపీ నిరసన
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధంకు యత్నం, అడ్డుకున్న పోలీసులు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
మోదీ మాతృమూర్తి పై దూషణలు చేయడం సిగ్గుచేటు – బిజెపి పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దూషణలు చేయడాన్ని నిరసిస్తూ హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ నిరసనలో రాహుల్ గాంధీ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
నిరసన సందర్భంగా బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య కాసేపు తోపులాట చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ… బీహార్ రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్రలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి పై కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్ గాంధీ సమక్షంలో దూషణలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ దేశంలో 11 ఏండ్లుగా ఒక్క నిరుపేద తల్లి కుమారుడు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక మోదీ తల్లిని దూషణలు చేయడం వారి అహంకారానికి, పరాకాష్టకు నిదర్శనమని అన్నారు. రాజకీయంలో విమర్శ, ప్రతి విమర్శ ఉండాలి తప్ప ఈ రకంగా చనిపోయిన తల్లిని దూషణలు చేయడం ఘోరమైన విషయమని చెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా దేశ అత్యున్నత స్థాయిలో ఉన్న భారత ప్రధానమంత్రి మోదీ ని అమర్యాదగా మాట్లాడి, వారి తల్లిని కించపరిచే విధంగా మాట్లాడటం సబబు కాదని హెచ్చరించారు. ఓటు చోరీ పేరుతో దేశ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు “తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగి మీరు గెలిచారా” అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.
నరేంద్ర మోదీ మచ్చలేని వ్యక్తిత్వం, నిజాయితీగా దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తుంటే. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కడ పాలుపోకా ఓట్ చోరీ అని యాత్రలు చేస్తుందని ఎద్దెవా చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదన్నారు. వెంటనే రాహుల్ గాంధీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది కి క్షమాపణ చెప్పాలని బీజేపీ హుస్నాబాద్ పట్టణ పార్టీ డిమాండ్ చేస్తూ, హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోళ్లపెల్లి వీరాచారి, జిల్లా కౌన్సిల్ మెంబర్ కర్ణకంటి నరేష్, బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్, కాదాసు దీపికా, ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు బొప్పి శెట్టి సాయిరాం, వడ్డెపల్లి లక్ష్మయ్య, అక్కన్నపేట మండల కార్యదర్శి బానోతు అనిల్ నాయక్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు రైనా నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు వేముల దేవేందర్ రెడ్డి, తోట సమ్మయ్య, కురిమెల్ల శ్రీనివాస్, వరియోగుల అనంతస్వామి, అశాడపు శ్రీనివాస్, నారోజు నరేష్, లకవత్ శారద, బీజేపీ నాయకులు విశ్వనాథుల యాదగిరి, బీసా శ్రీకాంత్, రాజు ,తదితరులు పాల్గొన్నారు.





