
ఆందోళన చెందవద్దు.. సహాయక చర్యలు చేపడుతున్నాం..
కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జు పూజల హరికృష్ణ

సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట
భారీ వర్షా కారణంగా సిద్దిపేట లో కాంగ్రేస్ నియోజకవర్గ ఇంచార్జు పూజల హరికృష్ణ బుధవారం సిద్దిపేట లోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించారు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయింది ఆప్రాంతంలో పర్యటించి ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. నీటిని తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శ్రీనగర్ కాలనీలో మంచినీటి వాటర్ బబ్బుల్స్ నేరుగా మోసుకుని వెల్లి ప్రజలకు అందజేశారు.

ప్రజలవరు అధైర్యపడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది..
ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటికి రండి.
పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ.
ప్రజలు ఎవరు అధైర్య పదవద్దని.. వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ అన్నారు. గురువారం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు మత్తడి దూకడంతో దాని కాలువ పొంగిపొర్లడంతో ముంపుకు గురైన శ్రీనగర్ కాలనీలోని పలు కాలనీలను ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు అలుగులు దుంకుతున్నాయని, పలుచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని అన్నారు. పట్టణంలోని కోమటి చెరువు మత్తడి దూకడం వల్ల ఎక్కువ మొత్తంలో వరద నీరు కాలనీలో చేరిందని అన్నారు. ముంపు కు గురి అయిన వారు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు వారికి అండగా నిలుస్తారన్నారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటికి రావాలని సూచించారు.






